సంచార మలేరియ మరియు డెంగీ చికిత్స వాహనం ప్రారంభం

ప్రచురణ తేది : 27/07/2019
సంచార

జిల్లా మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అన్నారు. గుంటూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన మొబైల్ మలేరియా, డెంగ్యూ క్లినిక్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి, మాచెర్ల, గుంటూరు, చిలకలూరిపేట పట్టణంలో ఎక్కువగా మలేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు . ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని తాము మొబైల్ మలేరియా, డెంగ్యూ క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. అక్టోబర్ చివరి వరకు క్లినిక్ కొనసాగుతుందని చెప్పారు.