Close

ముఖ్య ప్రణాళిక అధికారి

ఎ) ముఖచిత్రము

శాఖ యొక్క పాత్ర మరియు కార్యాచరణ:

జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి భారత ప్రభుత్వము/రాష్ట్ర ప్రభుత్వముచే రుపొందినచినడిన వివిధ రంగాల యొక్క గణాoకాల సేకరణ, సంగ్రహణ మరియు విశ్లేషణలో పాల్గోనును. ఈ గణాoకాలను ప్రజల సంక్షేమము కొరకు వివిధ పధకాలు మరియు ప్రణాళికలు సూత్రీకరించుటలో ప్రభుత్వమునకు సహాయపడును.

బి) సంస్థాగత నిర్మాణ క్రమము

జిల్లా అధికారుల నుండి దిగువ స్థాయి అధికారుల సంస్థాగత నిర్మాణ క్రమము:

cpo

సి) పధకాలు/ కార్యకలాపాలు/ కార్యప్రణాళిక

వ్యవసాయము మరియు కాలానుగుణ పరిస్థితులు:

I.వ్యవసాయము

(I) వర్షపాతం:మండలానికి ఒకటి చొప్పున 57 మండలాలలో 57 రెవిన్యూ వర్షమాపక కేంద్రాలు కలవు. ప్రభుత్వము ఉత్తర్వులు ననుసరించి గ్రామీణ మరియు పట్టణ రెవిన్యూ కార్యాలయములో గల 57 రెవిన్యూ వర్షమాపక కేంద్రాల నుండి ప్రతీ దిన/ వారపు/ నెలవారీ వర్షపాత గణాంకాలను సేకరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు వాతావరణ కేంద్రము, హైదరాబాదు (ఎoచుకున్న కేంద్రాలకు) నకు పంపబడును. జూన్ 2014 నుండి అధికార ప్రయోజనము కొరకు 130 ఎ.డబ్ల్యూ.ఎస్. వర్షమాపక కేంద్రాలను అన్ని జిల్లాల తహసీల్దార్లుకు సమీకృత వర్షపాత నమోదును తెలియు జేయుటకు స్థాపింపబడినవి. www.apsdps.ap.gov.in కు లాగిన్ అయినచో ఈ ఇంటిగ్రేటెడ్ వర్షపాతము యొక్క వివరములు తెలుకొనవచ్చును.

(ii) ఋతువు మరియు పంట పరిస్థితి నివేదిక:వర్షపాతము, ప్రతీ వారపు/నెలవారీ ఋతువు మరియు పంట పరిస్థితి నివేదికను, పంటల వారీగా నాటిన వివరములను సేకరించి రాష్ట్ర ప్రభుత్వమునకు పంపిoచబడును.

(iii) వ్యవసాయ గణన: ఖరిఫ్ సీజన్/ రబీ సీజనలలో సాగునీటి సదుపాయము కలిగిన మరియు సాగునీటి సదుపాయము లేని వివిధ పంటల తుది గణాంకాలను ప్రతి రెవిన్యూ గ్రామము నుండి సేకరించి, మండల, డివిజినల్ మరియు జిల్లా సంగ్రహ పట్టికలు తయారు చేయబడును. ప్రతీ సంవత్సరము ఈ రెండు సీజనలకు సంబంధించిన మండలాల వారీగా సంక్షిప్తము చేయబడిన జిల్లా సంగ్రహ పట్టికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు సమర్పిచబడును.

(iv) ప్రధాన మంత్రి ఫసల్ భీమ యోజన (PMFBY) :  గుంటూరు జిల్లాలో 2016 ఖరీఫ్ నుండి ప్రధానమంత్రి ఫసల్ భీమ యోజన/ ప్రధానమంత్రి పంట భీమా పధకం అమలులో ఉంది. గ్రామం యూనిట్ గా ఈ పంట భీమ పధకం అమలవుతుంది.

  1. ఈ గ్రామా భీమ పధకములో కనీసము 100 హెక్టార్లు ప్రధానమైన పంట ప్రాంతము కలిగిన గ్రామము ఒక యూనిట్ గా పరిగణింపబడును.

  2. గ్రామములో ఎంచుకున్న పంట ప్రాంతము 100 హెక్టార్ల కన్నా తక్కువగా న్నునచో ప్రక్కనున్న గ్రామాలను ఈ భీమా విభాగపు ఏర్పాటుకు సమీకరింవచ్చును .

  3. అమలు చేయువలసిన పంట కోత ప్రయోగాలూ

గ్రామం యూనిట్ గా అమలు చేస్తే ——————————- 4 ప్రయోగాలు

గ్రామాలు యూనిట్ గా అమలు చేస్తే —————————-  4 ప్రయోగాలు

5 గ్రామాలు కన్నా ఎక్కువ/మండలం యూనిట్ గా అమలు చేస్తే – 10 ప్రయోగాలు

తాలూకా యూనిట్ గా అమలు చేస్తే —————————- 16 ప్రయోగాలు చేయాలి.

భారత ప్రభుత్వము 2016 ఖరిఫ్ సీజన్ నుండి ప్రధాన మంత్రి ఫసల్ భీమ యోజన పధకమును ప్రారంభించింది. ఈ పధకమును రాష్ట్రం లోని అన్ని జిల్లాలలో అమలు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం చేసింది.

డి) సంప్రదించవల్సిన వారి వివరములు

క్ర.సం. పదవి మొబైల్ నెం. ఆఫీసు ఫోన్ నెం. ఫాక్స్ నెం. ఈ మెయిల్
1 జాయింట్ డైరెక్టర్ & ముఖ్య ప్రణాళికాధికారి        
2 గణాంకాధికారి        
3 డిప్యూటీ గణాంకాధికారి        

ఇ) ముఖ్య లింకులు

రాష్ట్ర హెడ్ ఆఫీసు వివరాలు:    

డైరక్టరు,
ఆర్ధిక మరియు గణాంక డైరెక్టరెట్ , గొల్లపూడి
విజయవాడ.
మొబైలు : 9849908540
ఆఫీసు నెం.: 08662410312
ఈ మేయిల్ : desgollapudi[at]gmail[dot]com