Close

ఎకానమీ

ఉపోద్ఘాతము

మండల స్థాయిలో స్థూల ప్రాధమిక స్థాయి ప్రణాళిక మరియు వికేంద్రీకృత ప్రణాళిక యొక్క ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యత రోజు రోజుకూ పెరుగుతున్నందున, వికేంద్రీకృత ప్రణాళిక తయారు చేయుటకు వివిధ అభివృద్ధి సూచికల యొక్క సరియైన సమాచారము అవసరము. వాటిలో మండలము యొక్క దేశీయ ఉత్పత్తుల అంచన లేక మండల ఆదాయము ముఖ్యమైన సూచికలు. ప్రణాళికలు తయారు చేసే వారికి అంతర మండల వైవిధ్యాలను పోల్చడానికి. మండల అసమానతలను పరీక్షించుటకు, సూక్ష్మస్థాయిలో (మండల స్థాయి) అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడానికి మండలము యొక్క తలసరి ఆదాయ సూచిక సహాయపడుతుంది. ఈ కాలములో ప్రాధమిక సమాచారపు లభ్యత క్రమముగా అభివృద్ధి చెందడం వలన మండల ఆదాయము కొరకు మెథడాలజీ పై సమగ్ర సమీక్ష డేటాబేస్ ను ఆధునీకరించుటకు స్థిరముగా తీసుకోనబడుచున్నది.

భావనలు మరియు నిర్వచనాలు

నిర్ణీత సమయములో సామాన్యముగా ఒక సంవత్సర కాలములో నకలు లేకుండా మండలము యొక్క నిర్ణీత భౌగోళిక సరిహద్దుల మధ్య ఉత్పత్తి కాబడిన వస్తువులు మరియు అందించబడిన సేవల యొక్క ఆర్ధిక విలువలు మొత్తాన్ని మండల దేశీయ ఉత్పత్తిగా (MDP)గా నిర్వచింపబడినది.

ఆర్ధిక రంగము

మండల దేశీయ ఉత్పత్తిని అంచనా వేయుట కొరకు ఆర్ధిక వ్యవస్థను మూడు రంగములుగా విభజించిరి.

  • వ్యవసాయ మరియు అనుబంధ రంగము.
  • పారిశ్రామిక రంగము.
  • సేవా రంగము.

I.వ్యవసాయ రంగము

వ్యవసాయ రంగము ఈ క్రింది వానిని కలిగియున్నది.

  •  వ్యవసాయము
  •  పశుసంపద.
  •  అటవీ సంపద & కలప.
  •  చేపల వేట.

II పారిశ్రామిక రంగము.

పారిశ్రామిక రంగము ఈ క్రింది వానిని కలిగియున్నది.

  •  ఘనుల త్రవ్వకము & క్వారీ.
  •  వస్తువుల తయారీ (ఆమోదించబడినవి & ఆమోదించబడనవి)
  •  కరెంటు, గ్యాస్ & నీటి సరఫరా. నిర్మాణములు.

III సేవారంగము

సేవా రంగము ఈ క్రింది వానిని కలిగియున్నది.

  •  వ్యాపారము భోజన మరియు ఫలహారశాలలు.
  •  రైల్వేస్
  •  ఇతర రవాణా సదుపాయములు మరియు నిల్వ
  •  కమ్యూనికేషన్స్
  •  బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్.
  •  రియల్ ఎస్టేట్స్, నివాస మరియు వ్యాపార సేవల యాజమాన్యము.
  •  ప్రజా పరిపాలన.
  •  ఇతర సేవలు.