• Site Map
  • Accessibility Links
  • English
Close

గ్రామము & పంచాయితీలు

గుంటూరు జిల్లా స్వాధీన పరచుకొన్న మండలాలతో కలిపి 53 మండలాలు,  1022 గ్రామ పంచాయితీలు కలిగివున్నది.ప్రధాన గ్రామ పంచాయితీ కార్యాలయాల సముదాయములో పంచాయితీ కార్యదర్శులు పనిచేయుచున్నారు. గ్రామీణ ప్రజలకు పౌర సౌకర్యాలు కల్పించడమే పంచాయితీరాజ్ శాఖ యొక్క ముఖ్య లక్ష్యము.

పౌర సౌకర్యాలు

పారిశుధ్యము, త్రాగునీటి సరఫరా, వీథి దీపాలు మరియు గ్రామములోను, గ్రామము చుట్టు ప్రక్కలా నిధుల లభ్యతను బట్టి అభివృద్ధి కార్యక్రమములు చేపట్టుట, ఇవియే కాక జిల్లా పాలన వ్యవస్థ మరియు ప్రభుత్వము వారిచే అప్పగించబడిన వివిధ రకముల కార్యక్రమములను ఈ శాఖ అదనముగా చేపట్టును. అనగా ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లు, ఐ.ఎస్.ఎల్. ల నిర్మాణము మొదలగున్నవి.

గ్రామ పంచాయితీ ఆదాయ వనరులు

ఇంటిపన్నులు, మత్స్య సంబంధ లీజులు, రోడ్ల నిర్వహణ, మార్కెట్ కిస్తీలు, ఆసీలు, లే-అవుట్ మరియు భావన రుసుము, కభేళ మొదలుగున్నవి ప్రభుత్వము వారిచే 14వ ఆర్ధిక కమీషన్ ద్వారా క్రమముగా విడుదల చేయబడు గ్రాంట్లు గ్రామ పంచాయితీలకు ఇవ్వబడిన మార్గ దర్శకాలననుసరించి అభివృద్ధి కార్యక్రమములు చేపట్టును. 2002 సంవత్సరంలో ప్రభుత్వము వారు పంచాయితీ కార్యదర్శుల ఏర్పాటును ప్రవేశపెట్టి, వారి యొక్క విధులను జి.ఓ.ఎంఎస్. నెo. 295, పి ఆర్ & ఆర్ డి. ది. 2007లో పొందుపరిచిరి. గ్రామ పంచాయితీలలో పరిపాలన చట్టము మరియు నిబంధనల ప్రకారము జరుగుచున్నదని నిర్ధారించు విస్తరణాధికారి (పి ఆర్ & ఆర్ డి) ఆధీనములో పంచాయితీ కార్యదర్శులు పనిచేయుదురు. ఈ విస్తారణాధికారికి పై అధికారులుగా విభాగ పంచాయితీ అధికారి మరియు ఆపైన జిల్లా పంచాయితీ అధికారి వుంటారు. వారు నిర్ణీత కాల వ్యవధులలో గ్రామ పంచాయితీల పరిపాలనా పద్ధతిని తనిఖీ చేయుదురు.

గ్రామీణ ప్రాంతాలలో నివసించు సామాన్య ప్రజలకు తప్పనిసరిగా కల్పించవలసిన రొజువారీ అవసరాలైన పారిశుధ్యము, త్రాగునీటి సరఫరా మరియు వీధి దీపాలు మొదలైన వాటిని సమకూర్చుటకు గ్రామ పంచాయితీల వనరులను పెంపొందించుట చాలా అవసరము.

దీని కొరకు పన్నుయేతర రుసుములైన పారుదల రుసుము మరియు వీధి దీపాల రుసుము, గ్రామ పంచాయితీల పరిధిలో ఏర్పాటు చేయబడిన. పెద్ద ప్రకటన తెరలపై (హోర్డింగ్స్) ప్రకటన పన్ను మొదలగున్నవి వసూలు చేయుదురు.